![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -430 లో....మాయ, రాజ్ ల పెళ్లికి ఇంట్లో బట్టలు సెలక్ట్ చేస్తుంటారు. అప్పుడే కావ్య వచ్చి అది చూసి షాక్ అవుతుంది.. కావ్య టలా వెళ్ళిపోతావేంటి మీ అయన పెళ్లికి నువ్వు కూడా చీర కొనుక్కో మా వదిన ఏం అనుకోదని రుద్రాణి అంటుంది. నువ్వు దూరంగా నిలబడ్డావ్.. పెళ్లి నీకే కదా చీరలు సెలక్ట్ చేసుకోమని మాయకి రుద్రాణి చెప్తుంది. నాకు సెలెక్ట్ చేసుకోవడం రాదని మాయ అనగానే.. నీకెందుకు తెలియదు అంత తెలుసని ధాన్యలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రాజ్ వస్తాడు. తనని చూసిన మాయ భయపడుతుంది. ఏం జరుగుతుందని రాజ్ అడుగుతాడు. పెళ్లి చీరల సెలక్షన్ జరుగుతుందని రుద్రాణి చెప్తుంది. కావ్య నువ్వు మాయకి చీర సెలక్ట్ చెయ్ అని రుద్రాణి అనగానే.. వస్తున్నా అత్త అంటు స్వప్న వచ్చి.. మీ కొడుకు రాహుల్ ఎక్కడ? నేను రెండో పెళ్లి చేసుకుంటాను.. వాడి చేత నో ఆబ్జెక్షన్ ఫామ్ పై సంతకం చేయించుకుంటాను.. నువ్వు నీ కొడుకు పెళ్లి బట్టలు సెలక్ట్ చెయ్యాలని స్వప్న అనగానే.. నీకెలా కన్పిస్తున్నానని రుద్రాణి అంటుంది. మరి నా చెల్లి ఎలా కన్పిస్తుందని స్వప్న అంటుంది. అది ఎంత బాధని అనుభవిస్తుందని స్వప్న అంటుంది. నీ చెల్లే సంతకం చేసింది కదా అని రుద్రాణి అడుగగా. వాళ్ళ అత్త శాసిస్తుంది.. అది రాసిస్తుంది.. నీలాగా సిగ్గు లేకుండా పుట్టింట్లో ఉండలేక ఇక్కడే ఉండట్లేదని స్వప్న అంటుంది. స్వప్న తన చెల్లికి అన్యాయం జరుగుతుందని ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
ఆ తర్వాత కాబోయే కోడలికి నగలు ఇవ్వడం ఆచారం కదా.. మరి నగలు ఇవ్వవా అని అపర్ణతో రుద్రాణి అంటుంది. ఇవ్వాలని కావ్యకి ఇచ్చిన నగలు తీసుకొని రమ్మని చెప్తుంది. కావ్య వెళ్తుంటే ఇందిరాదేవి వద్దని చెప్తుంది. అయిన కావ్య వినకుండా నగలు తీసుకొని వచ్చి అపర్ణకి ఇస్తుంది. అపర్ణ మాయకి ఇస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. నువ్వేం టెన్షన్ పడకు మాయకి వార్నింగ్ ఇచ్చానని చెప్తాడు. మరొకవైపు మాయ ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి బ్యాగ్ సర్దుతుంటే.. అప్పుడే రుద్రాణి వస్తుంది. తనకి జరిగిందంతా చెప్పి ఇక వెళ్తానని అనగానే మళ్ళీ రాహుల్ వచ్చి.. నాకు తెలుసు ఇలా లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి చేస్తావని అని రాహుల్ అంటాడు. తరువాయి భాగంలో మాయ, రాజ్ కి పెళ్లి చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తారు. మొదటిసారి నన్ను ఈ ప్రాబ్లమ్ నుండి సేవ్ చెయ్.. ఇది నువ్వు మాత్రమే చేయగలవని కావ్యతో రాజ్ అంటాడు. మీరేం టెన్షన్ పడకండి.. అంత నేను చూసుకుంటానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |